Pavitra తో పెళ్లి.. మూడో భార్యకు Naresh ఎంత భరణం ఇచ్చాడో తెలుసా..?

పెళ్లి చేసుకోబోతున్నామంటూ న్యూయర్ రోజున పవిత్ర-నరేష్ ఓపెన్‌గా చెప్పేసిన విషయం తెలిసిందే.

Update: 2023-01-03 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేసుకోబోతున్నామంటూ న్యూయర్ రోజున పవిత్ర-నరేష్ ఓపెన్‌గా చెప్పేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ మొదట షాక్‌కు గురయ్యారు. అసలు భవిష్యత్తులో పెళ్లి జోలికి పోనని చెప్పిన నరేష్ నాలుగో పెళ్లికి ఎలా రెడీ అయ్యాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు నరేష్ గురించి పోరాడిన అతడి మూడో భార్య రమ్య పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో లేవనెత్తాయి. అయితే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంత పబ్లిక్‌గా అనౌన్స్ చేశారంటే రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేశాడా.. అదే కనుక జరిగితే ఆమెకు ఎంత భరణం ఇచ్చిఉంటాడు అనే అనుమానాలు ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కొన్ని వర్గాల సమాచారం మేరకు.. తన మూడో భార్య రమ్యకు రూ.5 కోట్లు భరణం ఇచ్చినట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇద్దరు కుటుంబాల పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు నరేష్‌, పవిత్రపై అంతలా విరుచుకు పడినా రమ్య ఇంతా ఈజీగా ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీటితో పాటు రమ్యకు కర్ణాటకాలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయని అలాంటప్పుడు ఈ 5 కోట్లు కోసం ఒప్పుకోవడం ఏంటనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా నరేష్, పవిత్ర మాత్రం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వీటిపై రమ్య రఘుపతి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : షీ ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ బోల్డ్‌నెస్: Malaika Arora 60 ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా!

Tags:    

Similar News