మార్చి 23 అమరవీరుల దినోత్సవం : సోనూసూద్ ఇంట్రస్టింగ్ పోస్ట్
1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీసారు.
దిశ, వెబ్‌డెస్క్: 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీసారు. వారి మరణాలకు గుర్తుగా ఆరోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే వారి త్యాగాలను గుర్తు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు సోనూసూద్ ఓ పోస్ట్ పెట్టాడు. తన తొలి చిత్రంలోని భగత్ సింగ్ ఫోటోను షేర్ చేసిన ఆయన ‘23 మార్చి.. అమరవీరుల దినోత్సవం.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల త్యాగాలను స్మరించుకుందామన్నారు.
తన తొలి చిత్రం షయిద్ - ఈ - ఆజాంలో తనకు భగత్ సింగ్ పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టమన్నారు.’ ఈ పోస్ట్‌కు ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ అచ్చం భగత్ సింగ్‌లా ఉన్నారు అని రాసుకొచ్చాడు. మరొకరు స్పందిస్తూ ‘ఇంకిలాబ్ జిందాబాద్..’ ‘భారత్ మాతాకీ జై’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also read: కఠిక దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్న నటికి జబర్దస్త్ ఆఫర్!