వారి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి.. డైరెక్టర్ సంచలన పోస్ట్!

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాలు తెరకెక్కించాడు.

Update: 2024-09-27 13:32 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాలు తెరకెక్కించాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు. తాజాగా, వివేక్ X వేదికగా డైరెక్టర్ ముఖేష్ పోస్ట్‌పై రియాక్ట్ అవడం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

అసలు విషయంలోకి వెళితే.. డైరెక్టర్ ముఖేష్ సోషల్ మీడియా ద్వారా ‘‘ఒక నటుడు 200 మంది కాస్టింగ్ దర్శకులు, 15,680 మంది మేనేజర్లు ఇలా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి’’ అని పోస్ట్ పెట్టారు. దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ‘‘ఓ మేనేజర్ పొగరు కారణంగా గత వారం నేనొక నటుడిని తొలగించాల్సి వచ్చింది.  ‘పేరు పొందిన సెలబ్రిటీలు స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీ’కి చెందిన ఉద్యోగి అలాగే ఉండాలని దురుసుగా ప్రవర్తించడం తన హక్కుగా భావించాడు.

కొందరు మధ్యవర్తులు ఎంతో మంది  కెరీర్‌లను నిలబెట్టవలసింది పోయి నాశనం చేస్తున్నారు. వర్క్ షాప్ నిర్వహించి అలాంటి వారికి శిక్షణ ఇవ్వండి’’ అని రాసుకొచ్చారు. కానీ తనతో దురుసుగా ప్రవర్తించింది ఏ సెలబ్రిటీ మేనేజర్ అనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అతను ఎవరా అని సెర్చింగ్ మొదలెట్టారు.


Similar News