ధైరవ్‌ సొంత బిడ్డకంటే ఎక్కువే అంటున్న Manchu Manoj

పెళ్లిళ్లు ఒకప్పటి సంగతి ఏమోకానీ, నేటి కాలంలో పెటాకులు కావడానికి పెద్దగా సమయం తీసుకోవడంలేదు.

Update: 2023-06-27 08:26 GMT

దిశ, వెబ్​డెస్క్​ : పెళ్లిళ్లు ఒకప్పటి సంగతి ఏమోకానీ, నేటి కాలంలో పెటాకులు కావడానికి పెద్దగా సమయం తీసుకోవడంలేదు. అలాగే ఇద్దరు కలిసి బతకాలనుకుంటే దానికి పెద్దలు గీసే హద్దులూ ఉండటం లేదు. ఇదే జరిగింది మంచు మనోజ్​, భూమా మౌనిక విషయంలో. అసలు విషయం ఏమిటంటే వీరికి పెళ్లికి ముందే ఒకరితో ఒకరికి ఎంతో అన్యూన్య సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది.

    ఎందుకంటే వీరు పెళ్లి చేసుకోకముందే మనోజ్​ భూమా మౌనిక కుమారుడితో కలిసి ఉన్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఇటీవల కూడా భూమా మౌనికకు మొదటి వివాహానికి కలిగిన కుమారుడు ధైరవ్‌ని మనోజ్​ ఎత్తుకున్న ఫొటోలు, పెట్​ డాగ్​తో ఆడకుంటున్న ఫొటోలు ఆయనే స్వయంగా విడుదల చేశారు. అంతే కాక ధైరవ్‌ తనకు సొంత కుమారుడికంటే ఎక్కువ అని ఓ సందర్భంగా మీడియాతో చెప్పాడు.

Tags:    

Similar News