భారీ కాన్వాయ్‌తో అత్తారింటికి బయల్దేరిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనికరెడ్డిల వివాహం కన్నులపండువగా జరిగిన సంగతి తెలిసిందే..
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనికరెడ్డిల వివాహం కన్నులపండువగా జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 3న ఫిల్మ్ నగర్లో మంచు లక్ష్మి నివాసంలో ఈ జంట రెండో పెళ్లి ఇరువురి కుటుంబసభ్యులు.. సినీ ప్రముఖుల మధ్య వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. వివాహ తంతు పూర్తైన తర్వాత సంప్రదాయం ప్రకారం వధూవరులు అత్తారింటికి బయలుదేరారు. మంచు లక్ష్మి నివాసం నుంచి వరుడు మంచు మనోజ్, వధువు మౌనికరెడ్డతో కలిసి అత్తారింటికి బయలుదేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ కాన్వాయ్‌తో ఈ జంట తమ కర్నూలుకు బయలుదేరింది. అయితే మంచు మనోజ్.. సతీమణి మౌనికారెడ్డి ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లినట్లు వీడియోను చూస్తే తెలుస్తోంది. ఇకపోతే ఈజంట కర్నూలు వెళ్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే తొలుత ఈ కొత్తజంట పొద్దుటూరు వెళ్లి అనంతరం ఆళ్లగడ్డ ప్రాంతంలోని మౌనిక తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపోతే మంచు మనోజ్‌కు 2015లో ప్రణతిరెడ్డితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు. అలాగే మౌనికారెడ్డికి కూడా బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే మౌనికారెడ్డి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం మంచు మనోజ్, మౌనికారెడ్డిలు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ పుకార్లకు పెళ్లితో చెక్ పెట్టేశారు. మార్చి 3న సోదరి మంచు లక్ష్మి ఇంట్లో మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఏకమైంది ఈ జంట.