మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్.. అప్పుడే ట్రెండ్ అవుతున్న ‘షాబానో’

యంగ్ హీరోయిన్ మాళ్వి మల్హోత్రా ‘తిరగబడరా స్వామి’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Update: 2024-07-13 10:09 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మాళ్వి మల్హోత్రా ‘తిరగబడరా స్వామి’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ స్పెషల్ సాంగ్‌తో సందడి చేసింది ఈ బ్యూటీ. ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘షాబానో’ అనే ఇండిపెండెంట్ సాంగ్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది మాళ్వి.

డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయిన ఈ పాటకు యస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ తెలుగు‌తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది. విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఈ సాంగ్ విశేషంగా వైరల్ అవుతోంది. అలాగే యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచ్చి లిరిక్స్‌లో ఆకట్టుకుంటుంది.


Full View



Similar News