Malavika Mohanan : మహేష్ బాబుతో రొమాన్స్ కోరుకుంటున్న హీరోయిన్ !
రీల్ కపుల్స్ రియల్ కపుల్స్ అయితే అద్భుతంగా ఉంటుందని కేరళ యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ చెబుతోంది.
దిశ, సినిమా: రీల్ కపుల్స్ రియల్ కపుల్స్ అయితే అద్భుతంగా ఉంటుందని కేరళ యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ చెబుతోంది. ఆమె నటించిన 'క్రిస్టీ' ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్న నటి.. తాజాగా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. తాజాగా విడుదలైన 'క్రిస్ట్రీ' ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించడం హ్యాపీగా ఉందని, ఈ మూవీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోందని చెప్పింది. ' క్రిస్టీ కథ విన్న వెంటనే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ప్రతీ ఫ్రేమ్ బ్యూటిఫుల్‌గా ఉందంటున్నారు. నేను అందంగా కనిపించానని ప్రశంసలు కురిపించేస్తున్నారు' అంటూ మురిసిపోయింది. అలాగే మహేష్ బాబుతో కలిసి సినిమా చేయాలని ఉందన్న నటి.. ఆన్ స్క్రీన్ పెయిర్లో రీల్ కపుల్స్ రియల్ కపుల్స్ అవటం తనకు బాగా ఇష్టమని తెలిపింది. 'సూర్య జ్యోతికల పెయిర్ అంటే చాలా ఇష్టం. ఆ జోడి చూడముచ్చటగా ఉంటుంది. అలాగే నాకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగులు నచ్చవు. ఉంటే సూపర్ స్టార్స్ ఉంటారు అంతే. మళ్లీ ప్రత్యేకంగా లేడీ అని ట్యాగ్ చేయడం ఎందుకు?' అని అభిప్రాయాలు షేర్ చేసుకుంది.