‘మజాకా’ ఫస్ట్ లుక్ విడుదల.. పంచె కట్టులో అదిరిపోయిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ధనుష్ ‘రాయన్’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

Update: 2024-09-23 07:29 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ధనుష్ ‘రాయన్’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రజెంట్ సందీప్ కిషన్ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రినాధరావు డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. దీనిని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్యూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూవీలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, అన్షు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమా 2025లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా, సందీప్ కిషన్ మూవీకి మజాకా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన సాంప్రదాయ పట్టు పంచె, షర్ట్ ధరించి సంతోషంగా కనిపిస్తున్నాడు. పెద్ద కుర్చీలో కూర్చొని, పెద్ద టేప్ రికార్డర్‌ను భుజంపై పెట్టుకుని మోడ్రన్ వాచ్, చెప్పులు వేసుకున్నాడు. అలాగే చుట్టూ ఉన్న పూలు, పండ్లు, సంగీత వాయిద్యాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఈ పోస్టర్‌ను చూసిన నెటిజన్లు లుక్ అదిరిపోయిందని అంటున్నారు.


Similar News