Mahesh Babu: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ ‘పోకిరి’ మూవీకి నేటితో 17 ఏళ్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘పోకిరి’.

Update: 2023-04-28 08:49 GMT

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘పోకిరి’. ఈ సినిమా విడుదలై నేటితో (ఏప్రిల్ 28) 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. కాగా పోకిరి 2006 లో విడుదలై భారీ వసూళ్లతో రికార్డులను తిరగరాసింది. ఇందులో మహేష్ బాబు మేనరిజం, డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటివరకు లవర్ బాయ్‌గా ఉన్న మహేష్ బాబును ఒక్కసారిగా పోకిరి మాస్ హీరోను చేసింది. మహేష్ బాబు కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ నిలిచి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు’ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో మారుమోగుతుంది.

Also Read..

మహేష్ బాబు చేతుల మీదుగా ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్ 

మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ 

Tags:    

Similar News