MAHESH BABU: పబ్లిక్‌లో నాగార్జున కోడలు శోభిత పరువు తీసిన మహేష్ బాబు.. నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్

అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-13 04:13 GMT

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వీరిద్దరి ఫొటోలు షేర్ చేస్తూ X వేదికగా కొత్త కోడలుకు వెల్‌కమ్ చెప్పారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య ఓ ఇంటి కాబోతున్నాడనే ఖుషీలో ఉంటే.. సామ్ ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య రెండో పెళ్లిపై మండిపడుతున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చైతన్య శోభితను ట్రోల్స్ చేస్తూ పలు వీడియోలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత ధూళిపాళకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగా గతంలో ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చేసిన ఓ కండోమ్ యాడ్ చేయగా.. చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శోభిత ధూళిపాళ గురించి గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు తన సొంత బ్యానర్‌లో నిర్మించిన మూవీ ’మేజర్’. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శోభిత ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శోభిత ఇంగ్లీషులో మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న మహేష్ బాబు కలుగజేసుకుని 'తెలుగులో మాట్లాడవా ప్లీజ్' అని సెటైర్ వేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఎలా కవర్ చేసుకోవాలో తెలియని శోభిత తన బ్యాక్ గ్రౌండ్ మొత్తం బయటపెట్టారు. నేను తెలుగు అమ్మాయినే.. కానీ తెలుగు పెద్దగా రాదని చెప్పుకొచ్చారు. అయితే శోభితను కించపరచాలనే ఉద్దేశం మహేష్ బాబుకు లేదు. మహేష్ స్పాంటేనియస్గా జోక్స్ వేస్తారు. అలాగే అది ‘మేజర్’ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషనల్ ఈవెంట్. అందుకే మహేష్ బాబు ఆమెకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ఏది ఏమైనా మహేష్ బాబు అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News