బ్రా సీన్‌కు నో చెప్పిన నటికి డైరెక్టర్ వార్నింగ్.. దెబ్బకు ఒప్పేసుకున్న మాధురి
సీనియర్ నటులు మాధురీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్‌లకు సంబధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చర్చనీయాంశమైంది.
దిశ, సినిమా : సీనియర్ నటులు మాధురీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్‌లకు సంబధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చర్చనీయాంశమైంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ టిన్ను ఆనంద్ 1989లో తెరకెక్కించిన ‘Shanakht’ సినిమాకోసం మాధురితో తనకు జరిగిన ఓక చేదు అనుభవాన్ని తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ‘ఒక సిన్లో బ్రాలో కనిపించాలని మాధురికి చెప్పాను. దానికోసం ఆమెకు నచ్చినట్టు బ్రా తయారుచేసుకోమన్నాను. కానీ మాధురి ఆ సీన్ చేయనని మొహం మీదే చెప్పేసింది. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దీంతో ఈ సినిమాకు గుడ్ బై చెప్పమన్నాను. ఇంతలో ‘అది వదిలేయండి. ఆమెతో ఎందుకు వాదిస్తున్నారు? ఆమె అభ్యంతరం చెప్పవలసి వస్తే సినిమాకి సంతకం చేసే ముందు చెప్పి వుండాలి’ అని అమితాబ్ కాసేపు వాదించాడు. అయినా నేను పట్టించుకోకుండా వెంటనే మాధురి స్థానంలో మరొక నటి గురించి ఆలోచిస్తున్న విషయం ఆమెకు తెలిసింది. దీంతో వెంటనే బ్రా సీన్లో నటించేందుకు ఒప్పేసుకుంది మాధురి’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.