తెరపైకి అలనాటి బాలీవుడ్ అందాల తార మధుబాల బయెపిక్‏..

Update: 2024-03-16 07:12 GMT

దిశ, సినిమా: మధుబాల... ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో  60కి పైగా సినిమాల్లో నటించి.. హిందీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ‘ప్యార్ కియా తో డర్నా క్యా.. ‘ అంటూ అప్పట్లో వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసింది లెజెండరీ నటి మధుబాల. 1960 విడుదలైన ‘మొఘల్ ఎ అజం’ అనే సినిమాతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఈ అందాల తార అతి చిన్న వయసులోనే కన్నుమూసింది. 1933లో జన్మించిన మధుబాల 36 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచింది.

కాగా ఇప్పటికే చాలా మంది సీనియర్ నటీనటుల జీవిత చరిత్రలు తెరపై చూపించగా. ఇప్పుడు మధుబాల జీవితాన్ని కూడా వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహిస్తుండగా,మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అరవింద్ కుమార్ మాలవీయ కూడా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కానీ దురదృష్టం ఏంటీ అంటే మధుబాలగా నటించడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రావడం లేదు. కృతి సనన్ నటించనుందని టాక్ వినిపించినప్పటికీ.. అందులో నిజం లేదు. ‘అలాంటి సినిమాలు ఎవరూ చేయడం లేదని’ మధుర్ బ్రిజ్ భూషణ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మరి ఈ మధుబాల పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Read More..

మొగుడే నా శత్రువు అంటున్న హీరోయిన్.. పెళ్లైన ఆరు నెలలకు ఏం జరిగిదంటే? 

Tags:    

Similar News