‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ అని చెప్పడం కాదు పాటిస్తే బాగుంటుంది.. బాలయ్యపై మాధవి లత సెటైర్
సినీ ఇండస్ట్రీలో నటిగా తక్కువ సినిమాలు చేసినా.. గుర్తింపు మాత్రం భారీగానే పొందింది హీరోయిన్ మాధవీ లత.
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో నటిగా తక్కువ సినిమాలు చేసినా.. గుర్తింపు మాత్రం భారీగానే పొందింది హీరోయిన్ మాధవీ లత. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో.. ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తరచూ కాంట్రవర్సీ పోస్టులు, కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. ఇక తాజాగా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ గురించి కామెంట్స్ చేసిన ఆమె.. బాలయ్యపై సెటైర్స్ వేసింది.
‘‘భగవంత్ కేసరి’ సినిమాలో హీరో బాలకృష్ణ చేత గుడ్ టచ్- బ్యాడ్ టచ్ గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. హీరోలు ఇలా అవగాహన కల్పించడం చాలా మంచి విషయం. పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ డైలాగ్స్ చెప్పడమే కాదు వాటిని పాటిస్తే కూడా బాగుంటుంది’ అంటూ సెటైరికల్ కామెంట్ చేసింది. దీంతో బాలయ్య అభిమానలు షాక్ అవుతున్నారు. ‘ఇంతకు ఈమె ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది’ అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.