Samantha: ప్రేమ ఒక త్యాగం.. మీరు లవ్‌ను ఇచ్చినా ఇతరులు ఇవ్వరంటూ సమంత పోస్ట్.. నాగచైతన్య గురించేనా?
స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్నేళ్లకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో అంతా షాక్ అయిపోయారు. కొంతమంది సమంతకు సపోర్ట్ చేస్తూ చై, సామ్ కపుల్ బాగుందని అన్నారు. ఇక సమంత విషయానికొస్తే.. మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ పెట్టినా నెట్టింట నిమిషాల్లో వైరల్‌గా మారుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, సామ్ పెట్టిన కొటేషన్ నాగచైతన్య కోసమే పెట్టిందా అనే చర్చకు దారితీసింది. అందులో ఏముందంటే.. ‘‘ చాలామంది వ్యక్తులు స్నేహాన్ని, రిలేషన్‌షిప్‌ను సమానంగా చూస్తారని నేను అనుకుంటున్నా. మీరు ప్రేమను ఇవ్వండి నేను ఇస్తాను. కానీ కొన్ని సంవత్సరాలుగా నేను ఓ విషయం తెలుసుకున్నా.. ప్రేమ ఒక త్యాగం. కొన్ని సమయాల్లో మీరు లవ్‌ను ఇచ్చినా ఇతరులు ఇవ్వరు.. ఆ పొజిషన్లో వాళ్లు ఉండరు. నువ్వు ఇస్తే నేను ఇస్తాను అనే లాగా మారిపోతుంది’’ అనే కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా లవ్ సింబల్ పెట్టింది. ఇక అది చూసిన వారు నాగచైతన్య గురించే పెట్టిందని చర్చించుకుంటున్నారు.