ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘లింగనిబిడ్డ’ షార్ట్ ఫిల్మ్ (వీడియో)

నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపేలా షార్ట్​ఫిల్మ్‌లు నిర్మించాలని ‘దిశ’ ఎడిటర్​మార్కండేయ సూచించారు. Bhavya, Harshavardhan సమర్పణలో నిర్మించిన షార్ట్‌ఫిల్మ్ ‘లింగనిబిడ్డ’ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు.

Update: 2023-06-03 15:58 GMT

దిశ, హైదరాబాద్: నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపేలా షార్ట్​ఫిల్మ్‌లు నిర్మించాలని ‘దిశ’ ఎడిటర్​మార్కండేయ సూచించారు. Bhavya, Harshavardhan సమర్పణలో నిర్మించిన షార్ట్‌ఫిల్మ్ ‘లింగనిబిడ్డ’ పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్కండేయ మాట్లాడుతూ.. పాదాల పారాణి ఆరకముందే భర్తను తన భుజంపై మోసుకుంటూ వస్తున్న తీరును పోస్టర్‌లో చూపించి ఫిల్మ్‌పై ఆసక్తి పెంచారని తెలిపారు. లింగనిబిడ్డ పాత్రలో రజినీమహేశ్ జీవించారని, ఈ రోల్‌తో ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమోషనల్ స్టోరీని నిర్మించిన ‘హర్ష విలేజ్ షో’(Harsha Village Show) టీమ్ సభ్యులను అభినందించారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌కు బాలు పాలోజి నిర్మాతగా వ్యవహరించగా, ప్రసాద్​నంగునూరి కథ, మాటలు, దర్శకత్వం వహించారు. కిషన్​నునుగొండ కెమెరా, ఎడిటింగ్​రుస్తుం, రాధకిషన్, దూలం తిరుపతి, పవన్, సుప్రియ, మహేశ్​నటించారు. పోస్టరావిష్కరణలో దిశబ్యూరో చీఫ్ విశ్వనాథ్, అసిస్టెంట్ ఎడిటర్ హరీశ్, నెట్ వర్క్ ఇన్‌చార్జి ప్రవీణ్, న్యూస్ ఎడిటర్ మహేశ్ కుమార్, వెబ్ సైట్ ఇన్‌చార్జి నాగయ్య, ఫీచర్స్ ఎడిటర్ సుజిత, డిజిటల్ హెడ్ కిరణ్, ఎడిట్ పేజీ ఇన్‌చార్జి రాజు, నేషనల్ డెస్క్ ఇన్‌చార్జి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News