మెగా హీరో వరుణ్ తేజ్‌‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి..? ఒక్క ఫొటోతో క్లారిటీ..

Update: 2022-01-21 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ, పెళ్లి గురించిజోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగా చక్కెర్లు కొడుతున్నాయి. వీటంన్నిటికి కారణం లావణ్య త్రిపాఠి వరుణ్‌తో కాస్త క్లోజ్‌గా ఉండటమే. అంతే కాకుండా ఈ హాట్ బ్యూటీ వరుణ్ సోదరి నిహారిక వివాహానికి హాజరు అయి మెగా ఫ్యామిలితో సందడి చేసింది. అప్పటి నుండి ఈ వార్తలు మరి ఎక్కువయ్యాయి.

అయితే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు. కాగా లావణ్యతో పుట్టినరోజు వేడుకులు జరుపుకోవడానికి వీరిద్దరూ బెంగళూర్ వెళ్లినట్లు.. ప్రేయసి కోసం ఖరీదైన డైమండ్ రింగ్ కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. దీనితో ఈ రూమర్లకు లావణ్య పరోక్షంగా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. వరుణ్ బర్త్ డే రోజు తను ఇన్స్టాగ్రామ్‌లో ఒక స్టోరి పెట్టింది. అందరూఈ సొట్ట బుగ్గల సుందరి బెంగళూర్‌లో వరుణ్‌తో కలిసి ఉందంటున్న సమయంలో.. డెహ్రడూన్‌లో తన ఇంట్లో ఉన్న ఫొటోను షేర్ చేసింది. సొంత ఊరులో, కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. దీనితో అన్ని రూమర్లకు చెక్ పెట్టింది. వరుణ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News