ఏంటి? లావణ్య-రాజ్ తరుణ్‌కు పాప కూడా ఉందా? ఆమెకు ఎన్ని సంవత్సరాలంటే?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. మాల్వీ మల్హోత్ర అనే హీరోయిన్‌తో ఎఫైర్ కారణంగా రాజ్ మోసం చేశాడంటూ ప్రేయసి లావణ్య నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని కంప్లైంట్ లో పేర్కొంది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, రాజ్ తరుణ్‌ను వదలకపోతే చంపేసి.. డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేస్తామని బెదిరించారని వెల్లడించింది. దీంతో హీరో రాజ్ తరుణ్ స్పందించి.. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. రీసెంట్‌గా రాజ్ తరుణ్ అండ్ లావణ్యకు నిజంగానే లవ్ ఎఫైర్ ఉందని నిరూపణ అయ్యింది.
లావణ్య పోలీసులకు పలు ఆధారాలు చూపించింది. కేవలం మాల్వీ మల్హోత్ర మాత్రమే కాకుండా రాజ్ తరుణ్ జీవితంలో మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని తెలిపింది. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్యకు మూడేళ్ల పాప కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుండగా.. దీనిపై సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య అన్ని డ్రామాలు ఆడుతోందని, అసలు పాప లేదు, అలాగే లావణ్య.. మస్తాన్ వంటి వ్యక్తులతో తిరిగి లేనిది, రాజ్ తరుణ్, మాల్వీతో ప్రేమలో పడితే తప్పేంటి? అది లావణ్య ఓర్చుకోలేకపోతుందంటూ తెలిపారు. లవ్, సూసైడ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికే ఇదంతా చేస్తుందని లావణ్య మాటల్ని కొట్టిపారేశాడు.