Kalyan Ram: హైప్ పెంచేస్తున్న కళ్యాణ్ రామ్.. ఓన్లీ క్లైమాక్స్‌కే అన్ని కోట్లా?

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘NKR21’.

Update: 2024-07-30 11:21 GMT

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘NKR21’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి IPS ఆఫీసర్‌గా నటిస్తుండగా.. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘NKR21’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది.

హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా.. 1000 మంది ఆర్టిస్టులుతో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్లైమాక్స్ ఫైట్ కళ్యాణ్ రామ్ ఏకంగా 1000 మందితో చేయనుండటంతో మూవీపై మరింత హైప్ పెరిగిపోతుంది. ఇది ఇప్పటివరకు రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఖర్చు పెట్టిన క్లైమాక్స్ కాగా.. రూ. 8కోట్ల ఖర్చుతో క్లైమాక్స్ సీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News