లేడీ మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య.. ఆ ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే..

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2023-06-01 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు మరణ వార్త మరవకముందే తాజాగా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సత్యప్రియ(40) ఆత్మహత్య చేసుకోని మరణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె చెన్నైలో నివాసం ఉంటూ చాలా ఏళ్లుగా మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నారు. భర్తతో విడాకులనంతరం తను వడపళని కుమరన్‌ నగర్‌లో ఒంటరిగా ఉంటుంది. వీరికి ఒక కుమార్తె(యోగిత) కూడా ఉంది. అయితే గత ఆదివారం కుమర్తెకు వాట్సప్ కాల్ చేసి.. ‘‘నాకు జీవితంపై విరక్తి పుట్టిందమ్మా నేను సూసైడ్ చేసుకుంటున్నానని’’ చెప్పింది. సత్యప్రియ మాటలకు కంగారు పడ్డ యోగిత వెంటనే సమీపంలో ఉన్న రిలేషన్స్‌కు ఫోన్ చేసి తన అమ్మ వద్దకు వెళ్లమని కోరింది. వాళ్లు వెళ్లేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పంపించారు.

Read More...  లవర్స్‌కు గుండె పగిలే న్యూస్ చెప్పిన అనుపమ.. ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటో పోస్ట్.. 

Tags:    

Similar News