Kriti Shetty: నాజూకు నడుముతో కవ్విస్తోన్న కుర్ర హీరోయిన్.. స్టన్నింగ్ ఫొటో షూట్ వైరల్

కుర్ర హీరోయిన్ కృతి శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-09-13 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కుర్ర హీరోయిన్ కృతి శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. యువత గుండెల్ని కొల్లగొట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అద్భుతమైన నటనతో ఈ అమ్మడు శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు, వారియర్, కస్టడీ, మనమే వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ వంటీ చిత్రాల్లో నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే..

కృతి శెట్టి అప్పుడప్పుడు ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్‌తో సోషల్ మీడియాలో దర్శనమిస్తూ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుని, నాజూకు నడుముతో ఫిదా అయ్యే ఫొటో షూట్ చేసింది. అంతేకాకుండా తలలో రెండు గులాబీలు పెట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలను కృతి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Full View


Similar News