ప్రభాస్‌తో పెళ్లి వార్తలన్నీ పుకార్లే.. కొట్టిపారేసిన కృతి

బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ నటుడు ప్రభాస్‌‌తో డేటింగ్, మ్యారేజ్ రూమర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది. గత వారం రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని

Update: 2022-11-30 07:57 GMT

దిశ, సినిమా : బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ నటుడు ప్రభాస్‌‌తో డేటింగ్, మ్యారేజ్ రూమర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది. గత వారం రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కృతి. 'ఇది ప్రేమ కాదు.. అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు. మా 'భేడియా' అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడాడు. అతని వ్యంగ్యం ఎక్కడికో దారితీసి అనేక రకాల పుకార్లకు తావిస్తోంది. వెబ్‌సైట్స్‌ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించకముందే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఇవన్నీ పుకార్లు మాత్రమే' అని కొట్టిపారేసింది. దీంతో గతకొద్ది రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి : మాజీ ప్రియుడితో రాసలీలలు.. దొరికిపోయేసరికి స్నేహితుడంటూ ప్లేట్ ఫిరాయింపు

Tags:    

Similar News