Smoking : గుప్పు గుప్పు మంటూ సిగరెట్ తాగుతూ పొగలు వదులుతున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్

హీరోయిన్ కృతి సనన్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. 'ఆదిపురుష్' సినిమా టైంలో ప్రభాస్ తో ప్రేమలో ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. కానీ అదంతా అవాస్తవమని తెలియడంతో

Update: 2024-08-01 04:52 GMT

దిశ, సినిమా: హీరోయిన్ కృతి సనన్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. 'ఆదిపురుష్' సినిమా టైంలో ప్రభాస్ తో ప్రేమలో ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. కానీ అదంతా అవాస్తవమని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు ఈ భామ ప్రేమాయణం తెరమీదకు వచ్చింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఫారిన్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ప్రైవేట్ పిక్స్ లీక్ అయ్యాయి.

అయితే లవర్ తో తిరిగినా పర్లేదు కానీ ఈ అమ్మడు సిగరెట్ తాగుతున్న ఫొటోలు లీక్ కావడమే విమర్శలకు కారణం అవుతుంది. అంతకు ముందుగా ఓ సినిమాలో పాత్రకు తగినట్లుగా తాగుతూ, స్మోక్ చేస్తుంది కృతి. దీనిపై కొన్ని కామెంట్స్ రాగా మాది సంస్కారవంతమైన ఫ్యామిలీ అని.. మా ఇంట్లో అలాంటి విషయాలకు చోటు లేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియో ప్రెజెంట్ ట్రెండ్ చేస్తున్న నెటిజన్లు.. ఇదేనా సంస్కారం అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది ఆమె పర్శనల్ విషయమని, అయినా అమ్మాయిలు అలా చేస్తే తప్పుగా ఎందుకు చూడాలని అడుగుతున్నారు.





 


Tags:    

Similar News