విషమంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితి.. స్పందించిన నరేష్
గుండె పోటుకు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కొడుకు నరేష్ స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కొడుకు నరేష్ స్పందించారు. ''ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన శ్వాస తీసుకోగలుగుతున్నారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై 48 గంటలు గడిస్తేగాని ఏమి చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. రేపు ఇంకా బాగుంటుందని నమ్ముతున్నాం'' అని నరేష్ వెల్లడించారు. రీల్ లైఫ్‌లో.. రియల్ లైఫ్‌లో కృష్ణ డేరింగ్ పర్సన్.. ఆయన ఓ ఫైటర్ అని నరేష్ పేర్కొన్నాడు. తమ తండ్రికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. వయసు రీత్యా ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ సమస్య నుండి ఆయన త్వరగా బయట పడుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని నరేష్ కోరారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వాళ్లే రేపు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలిపాడు.