దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ చేధించిన ఆయన ప్రభాస్ పెళ్లి చూడకుండానే తుదిశ్వాస విడిచారు. తనకు ప్రభాస్ పెళ్లి చేయడం కంటే పెద్ద కోరిక ఏమీ లేదని.. ప్రభాస్ పిల్లలతో నటించాలని ఉందని పలుసార్లు వివిధ వేదికలపై చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'విశాల నేత్రాలు' అనే నవల చేయాలనుకున్నారు. ఈ నవలలో ప్రభాస్ తో చేయాలని కృష్ణం రాజు అనుకున్నారు. కానీ చివరి కోరిక తీరకుండానే అనారోగ్యంతో మృతి చెందారు. మొదటి నుంచి హీరో ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు ఎంతో ప్రేమ ఉండేది. అందుకే తమ్ముడి కుమారుడు అయినా, స్వయంగా కృష్ణంరాజే ప్రభాస్‌ను పెంచుకున్నాడు. వీరిద్దరి మధ్య బంధం విడదీయరానిది గా కొనసాగింది.
Also Read : కృష్ణంరాజు అంత్యక్రియలు అక్కడే..
ఇవి కూడా చదవండి :