ఆ ప్లేస్‌లో ముద్దు పెడుతూ.. పెద్ద సాహసమే చేసిన స్టార్ హీరోయిన్
హీరోయిన్ హనీ రోజ్ గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: హీరోయిన్ హనీ రోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ భారీగా పాపులారిటీ దక్కించుకుంది. దీంతో వరుస అవకాశాలతో పాటుగా, పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి ఆహ్వానించబడుతోంది. ఇక వీటన్నింటిని హాండిల్ చేస్తూ కూడా హనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ప్రస్తుతం ఈ నటి ఐర్లాండ్ టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర‍్న స్టోన్‌ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది . కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.