ఓటీటీలోకి రాబోతున్న ‘పుష్ప-2’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? (ట్వీట్)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule).

Update: 2025-01-22 06:52 GMT
ఓటీటీలోకి రాబోతున్న ‘పుష్ప-2’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? (ట్వీట్)
  • whatsapp icon

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్(Fahad Fazil), జగపతి బాబు(Jagapathi Babu), సునీల్, అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. దీనిని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డ్స్ కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇటీవల రీలోడెడ్ వెర్షన్‌ను మేకర్స్ థియేటర్స్‌లోకి తీసుకువచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప-2’ చిత్రం జనవరి 30 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ చూసిన వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News