భర్త సపోర్ట్‌తో సెక్స్ సీన్స్ చేసిన Kirti Kulhari.. చివరికి అదే పిచ్చితో..

బోల్డ్ బ్యూటీ కీర్తి కుల్హారి.. 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించి భారీ ప్రజాదరణ పొందింది.

Update: 2022-11-16 12:24 GMT

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ కీర్తి కుల్హారి.. 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించి భారీ ప్రజాదరణ పొందింది. అయితే తాను శృంగార సన్నివేశాల్లో అద్భుతంగా రాణించేందుకు తన మాజీ భర్త సాహిత్ సెహగల్ సాయం చేశాడని చెప్పింది. ఈ మేరకు ఆయనిచ్చిన విశ్వాసం, మద్దతుతోనే ఇంటిమసీ సీన్స్ సులభంగా చేశానన్న ఆమె.. లాయర్‌గా, ఒంటరి తల్లిగా నటించడం గొప్ప అనుభూతితోపాటు సరికొత్త అనుభవాన్ని ఇచ్చాయని చెప్పింది. ' కొన్ని లిప్ కిస్ సీన్స్, సన్నిహిత సన్నివేశాలు హద్దులు దాటినట్లుగా అనిపించినప్పటికీ స్టోరీ డిమాండ్ మేరకు చేయక తప్పలేదు. పెళ్లయిన వాళ్లంతా అభద్రతాభావంతో ఉంటారు. తెరపై ముద్దు పెట్టుకోలేరు. ఇంటమసీ సీన్లు చేయలేరు. కానీ, నేను దాన్ని తిరోగమనంగా భావిస్తా. ఎందుకంటే నా భర్త నిజంగా నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అందుకే క్యారెక్టర్‌కి కావాల్సింది ఇచ్చేందుకు వంద శాతం ఇచ్చేశా' అని చెప్పింది. అలాగే నలుగురు అమ్మాయిలు సెక్స్ దృశ్యాలను చూస్తున్నపుడు భిన్నమైన మార్గాలను కలిగి ఉంటారన్న నటి.. 'కొందరు ఎక్కువ భయపడతారు. మరికొందరికి పట్టింపులుండవు. కొంతమంది దానితో ఉన్నంతసేపు సుఖంగా ఫీల్ అవుతారు. ఇంకొందరూ దానితోపాటు జర్నీ చేస్తూ ఎక్కడికో వెళ్లిపోతారు' అని వివరించింది.

Tags:    

Similar News