విడాకుల గురించి ఏడేళ్ల కొడుకుతో చెప్పేందుకు నరకయాతన అనుభవించా.. లేడీ డైరెక్టర్ ఎమోషనల్
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, లేడీ డైరెక్టర్ కిరణ్ రావు విడాకులు తీసుకున్నా.. ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ డైవోర్స్ తీసుకోవాలనుకున్న
దిశ, సినిమా : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, లేడీ డైరెక్టర్ కిరణ్ రావు విడాకులు తీసుకున్నా.. ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ డైవోర్స్ తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని ఏడేళ్ల కుమారుడితో చెప్పేందుకు నరకయాతన అనుభవించామని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ ఫిమేల్ డైరెక్టర్. నిజానికి అమీర్, తాను విడిపోవాలని కొవిడ్ టైమ్‌లోనే డిసైడ్ అయినట్లు తెలిపింది. ‘అయితే కొడుకుతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలని చాలా ఆలోచించాం. కానీ కరోనా మాకు హెల్ప్ చేసింది. ఇంట్లోనే గడపడం మూలంగా ప్రాక్టికల్‌గా చెప్పగలిగాం. ఇందుకు కొవిడ్‌కు థాంక్స్‌కు చెప్పుకోవాలి’ అని వివరించింది.
ఇక విడిపోయినా అమీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తానని.. ఐరా ఖాన్ వెడ్డింగ్‌లో అంత ఎంజాయ్ చేసేందుకు ఇదే కారణమని తెలిపింది. ఇక తన కొడుకు కూడా నానమ్మతో స్పెండ్ చేస్తాడని.. పికిల్ బాల్, స్విమ్మింగ్ టైమ్‌లో తాను వెంటే ఉంటానని చెప్పింది. ఆయనకు సంబంధించిన బాధ్యతలను చూసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తానని అంటుంది కిరణ్.