ఆయనతో స్విమ్మింగ్ చేయడమంటే చాలా ఇష్టం.. అందుకే అక్కడికి తీసుకెళ్తా
యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాపై ప్రశంసలు కురిపించింది.
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాపై ప్రశంసలు కురిపించింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి భార్యభర్తలుగా తాము ఎంచుకున్న గమ్యాలను చేరడానికి పక్కా ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిపింది. అయితే అందులో ఎక్కువగా రొమాంటిక్ బీచ్ హాలిడేస్ ఉంటాయన్న ఆమె ఇటీవల భర్తతో కలిసి తన బర్త్ డేను స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి బీచ్‌కు వెళ్లడం ఇందులో భాగమనే చెప్పింది. ‘అదృష్టవశాత్తూ మా ఇద్దరికీ ప్రయాణం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక స్థలాన్ని ఎంచుకోవడం కష్టంగా ఉండదు. మేమిద్దరం మంచి స్విమ్మర్లమే. అయితే డైవింగ్, ఈత కొట్టడాన్ని నాకంటే బాగా ఆస్వాదిస్తాడు సిద్ధార్థ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ‘అధునాతన ఈతగాడు’ (Advanced swimmer). అయితే ఈత కొట్టడంలోనే కాదు దేనిలోనైనా తన ప్రతిభను చూపించడంలో ముందుంటాడు’ అంటూ పొగిడేసింది. చివరగా నీటిలో ఉన్నప్పుడే అతనితో మరింత క్లోజ్‌గా గడపడాన్ని ఎంజాయ్ చేస్తానంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది కియార.