ఖుషి కపూర్ వింత కోరిక పోస్ట్ వైరల్.. అసలు విషయం తెలిసి షాక్‌లో నెటిజన్లు
అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఇటీవల ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఇటీవల ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలై మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది. అలాగే ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేసి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకుంది.
అమ్మడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఖుషి అందాలకు కుర్రాళ్లు కూడా ఫిదా అయిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఖుషి కపూర్ తన వింత కోరిక బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్వెటర్ ధరించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘స్వెటర్ వేసుకునే వాతావరణం కోసం వేచి చూస్తున్నాను’’ అని క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఇదేం వింత కోరిక అని ఆశ్చర్యపోతూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.