KhushbuSundar: వైవాహిక బంధంపై ఖుష్భూ సెన్సేషనల్ ట్వీట్.. జయం రవి విడాకుల గురించేనా?
సీనియర్ నటి ఖుష్బూ ‘X’ వేదికగా సంచలన ట్వీట్ చేసింది.
దిశ, సినిమా: సీనియర్ నటి ఖుష్బూ ‘X’ వేదికగా సంచలన ట్వీట్ చేసింది. భార్యాభర్తల గురించి ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఏ వ్యక్తి అయినా తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకుంటాడు. ప్రేమించి వారికి తొలి స్థానాన్ని ఇచ్చి తన కోరికలు, స్వేచ్ఛకు సెకండ్ ప్లేస్ ఇస్తారు. ప్రతి వివాహం హెచ్చు, తగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, తప్పులు జరుగుతాయి. ఇలాంటి వాటి వల్ల బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒక బంధంలో సమయానుకూలంగా ప్రేమ కనుమరుగు కావచ్చు. కానీ గౌరవం, మర్యాదలు ఎప్పటికీ పోవు.
ఒక పురుషుడు తప్పకుండా తన భార్యకు సరైన గౌరవాన్ని ఇవ్వాలి. స్వార్థంతో చిన్నారుల మనసులు బాధపడతాయని చూడలేదు. కొన్నిసార్లు స్వార్ధంతో తీసుకునే నిర్ణయాల వల్ల పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. కాకపోతే ఆలస్యం కావచ్చు. తన భార్యను గౌరవించలేని వ్యక్తి ఇతరుల మర్యాద, జీవితంలో ఎదుగుదలను ఆశించలేడు. నిన్ను ప్రేమించి నీకు తోడుగా నిలబడిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరమైన విషయం. ఈ ప్రాథమిక విషయాన్ని మరచిపోయిన వ్యక్తి ప్రేమకంటే విలువైన బంధాన్ని ఆనందాన్ని కోల్పోయినట్లే’’ అని రాసుకొచ్చింది.
అయితే సడెన్‌గా ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో జయంరవి విడాకుల గురించే పెట్టిందని అంతా చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యతో విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్తీ ఈ విషయంపై సంచలన పోస్ట్‌తో షాకిచ్చింది. తనకు తెలియకుండా విడాకులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీంతో వీరి విడాకులు ఇష్యూ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఖుష్బూ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో వీరి గురించే అని అంటున్నారు.