పెద్ద సినిమాల రీ-రిలీజ్‍లపై.. Big Boss Sohel కీలక వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా జోరుగా ఉంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సినిమాలు సైతం థియేటర్స్‌లోకి వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్‌ల హవా జోరుగా ఉంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సినిమాలు సైతం థియేటర్స్‌లోకి వస్తున్నాయి. అయితే, ఈ రీ-రిలీజ్‍ల ఎఫెక్ట్ కొత్త చిన్న చిత్రాలపై బాగానే పడుతోంది. కొంతకాలంగా ప్రతీ వారం ఏదో ఒక భారీ సినిమా రీ-రిలీజ్ ఉండటంతో చిన్న సినిమాలపై ప్రభావం మరింత ఎక్కువైంది.
ఈక్రమంలో బిగ్‍బాస్ ఫేమ్, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా హీరో సయ్యద్ సోహెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులను నమ్మి, చాలా ప్యాషన్‍తో మేం సినిమాలు చేస్తాం. కానీ, వీకెండ్లలో పెద్ద సినిమాలు రీ-రిలీజ్ అవుతూ మొత్తం హైప్‍ను, దృష్టిని వాటిపై మరల్చుకుంటున్నాయి. ఒకవేళ కంటెంట్ బాగుంటే ప్రజలు చిన్న సినిమాలను చూస్తారు. అయితే ఇందుకు మౌత్ టాక్ చాలా ముఖ్యం. ఇందుకోసం 3, 4 రోజులు పడుతుంది. పాత సినిమాల రీ-రిలీజ్‍లను వీకెండ్లలో కాకుండా వీక్‍డేస్‍లో పెట్టుకోవాలని ప్రొడ్యూజర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులను నేను కోరుతున్నా. చిన్న సినిమాల థియేట్రికల్ రన్‍ను కాపాడాలని అభ్యర్థిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి :
అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఆ మహిళ అసభ్యకరంగా తాకింది: Dulquer Salman
బాయ్స్ హాస్టల్‌లో స్టే చేసేంత సీన్ లేదంటున్న రష్మీ.. ఏజ్ గ్యాప్ ఉందంటూ..