నటిని పిచ్చికొట్టుడు కొట్టిన పనిమనిషి.. రక్షించాలని వేడుకున్న షా

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాశ్మీరా షా తనను పనిమనిషి దాడి నుంచి కాపాడమని అభిమానులను వేడుకుంది.Latest Telugu News

Update: 2022-09-13 07:54 GMT
నటిని పిచ్చికొట్టుడు కొట్టిన పనిమనిషి.. రక్షించాలని వేడుకున్న షా
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాశ్మీరా షా తనను పనిమనిషి దాడి నుంచి కాపాడమని అభిమానులను వేడుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనింపిచే సీనియర్ నటి తాజాగా ఓ ఫన్నీ వీడియోతో అలరించింది. ఈ మేరకు తన ఇంట్లో పనిమనిషితో మసాజ్ చేయించుకున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. ఉదయం నిద్రలేవగానే ఉమన్ వర్కర్‌ను కాస్త ఒళ్లు పట్టమని అడిగానని, కానీ అందరూ అనుకుంటున్నట్లు తన మసాజ్ సేషన్ ఆస్వాదించేంత సున్నితంగా లేదని తెలిపింది. ఆమె దాడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా, వద్దని కింద పడి దొర్లినా విడిచిపెట్టకుండా నొక్కి నొక్కి చంపేసిందని.. మొత్తానికి మసాజ్ అంటే భయపడిపోయే స్థితికి తీసుకొచ్చిందని చెప్పింది.

Also Read : మణిరత్నంను ఆ విషయంలో తిరస్కరించిన అమలాపాల్

Tags:    

Similar News