ఆ సినిమాకోసం ఒంటరిగా పోరాడుతున్న కార్తిక్.. నెటిజన్లు ఫిదా!
చివరికి ఎలాగైనా మూవీని కాపాడాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు
దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కష్టాల్లో కూరుకుపోయిన తన అప్ కమింగ్ మూవీ 'షెహజాదా' బాధ్యతను భుజాన వేసుకున్నాడు. తెలుగు సినిమా 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ప్రస్తుతం ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సమావేశంలో చిత్ర బృందం తెలిపింది. 'ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించేందకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో సినిమా ఆగిపోయే పరిస్థితికి చేరుకుంది. చివరికి ఎలాగైనా మూవీని కాపాడాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. తన రెమ్యూనరేషన్ వదులుకునేందుకు సిద్ధపడ్డాడు' అంటూ చెప్పుకొచ్చారు. ఇక 'షెహజాదా'కు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా కృతిసనన్ హీరోయిన్గా నటిస్తోంది. 2023 ఫిబ్రవరి 10న విడుదల కాబోతున్న చిత్రం నుంచి త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన 'పఠాన్' ట్రైలర్