రోడ్డుపైనే నా చీర లాగి చిత్రహింసలు పెట్టాడు : కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2022-12-23 09:29 GMT

దిశ, సినిమా: కరాటే కళ్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక 'కృష్ణ' సినిమాలో ఆమె చేసిన బాబి పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలావుంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. 'సినిమాల్లో నేను చేసిన పాత్రల ఆధారంగా నా రియల్ క్యారెక్టర్‌ను డిసైడ్ చేశారు. కానీ, నా నిజ జీవితం గురించి ఎవరికీ తెలియదు. నా భర్త నుంచి విడిపోవడానికి బలమైన కారణం ఉంది. నన్ను ఏ విధంగా టార్చర్‌ పెట్టాడో మాటల్లో చేప్పలేను. ఓ రోజు తాగిన మత్తులో బేగంపేట దగ్గర నడి రోడ్డుపైనే నా చీరను లాగేశాడు. అందరూ చూస్తుండగానే నాకు ద్రౌపది వస్త్రాపహరణం అయింది. అందుకే అతన్ని వదిలేశా. మారుతాడనే నమ్మకం కూడా లేకపోయింది. కానీ, మా అమ్మ ఇప్పటికి నాకు ఒక తోడుండాలంటూ మళ్లీ పెళ్లి చేసుకోవాలి బలవంతం చేస్తుంది. ఒక తల్లిగా ఆమె ఆశించడంలో తప్పులేదు. నేను కూడా మరో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది' అంటూ ఎమోషనల్ అయింది.

నాకు అది నచ్చితే చాలు.. డైరెక్టర్ బ్యాగ్రౌండ్ పట్టించుకోను: రవితేజ


Similar News