సెట్ చేయరా అంటే సెట్ చేసుకున్నాడు.. ఫ్రెండ్ చేతిలో మోసపోయిన సూపర్ స్టార్

కన్నడ సూపర్ స్టార్ రక్షిత్ శెట్టి ‘సప్తసాగరలు దాటి’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

Update: 2023-11-14 14:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ సూపర్ స్టార్ రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ‘‘బీటెక్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డాను. ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశాను. నా ఫ్రెండ్, ఆ అమ్మాయి ఒకే బస్సులో వెళ్తుండటంతో ఆ లెటర్ తనకు ఇవ్వమని వాడికి చెప్పాను. రోజులు గడుస్తున్నా ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అలా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయినా ఎప్పటి లాగే నవ్వుతూ, సరదాగా కబుర్లు చెబుతూ ఉంది. ఏంట్రా ఈ పిల్ల ఏం చెప్పట్లేదని నా ఫ్రెండ్‌ను అడగ్గా.. వాడు లెటర్ ఇవ్వలేదని చెప్పాడు. చివరగా అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే.. నా ఫ్రెండ్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఇలా నా స్నేహితుడి చేతిలో మోసపోయాను’’ అంటూ రక్షిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Similar News