Kanguva Movie: మరోసారి పోస్ట్ పోన్ అయిన కంగువ.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కంగువ కూడా ఒకటి.

Update: 2024-08-26 11:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కంగువ కూడా ఒకటి. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్లో పోషిస్తున్నడు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా, హాట్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తుంది. కానీ, ఈ మూవీ మాత్రం ఇప్పటికి రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది.

ఇటీవలే అక్టోబర్ 10కి రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. అయితే, తెలిసిన సమాచారం ప్రకారం ఈ మూవీ అనుకున్నట్లుగా అక్టోబర్ 10కి విడుదల చేయడం లేదని తెలుస్తోంది. అసలు ఈ సినిమాకి రజనీకాంత్ మూవీ “వేట్టాయన్” నుంచి మొదలైంది ఎందుకంటే, అక్టోబర్ 10 న రిలీజ్ అని అనౌన్స్ చేసారు. అయితే.. దసరా హాలిడేస్ రావడంతో రెండు సినిమాలకు థియేటర్లు సరిపోతాయని అనుకున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ, “కంగువ” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఇంకాస్త సమయం తీసుకుంటే బెటర్ అని  దర్శకనిర్మాతలు ఈ మూవీని దసరా పండుగకి కాకుండా.. దీపావళి రిలీజ్ చేయాలని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల  నుంచి సమాచారం.   

Tags:    

Similar News