Kanguva: మెస్మరైజింగ్ మేకింగ్‌తో 'కంగువ' ట్రైలర్.. హైలైట్‌గా సూర్య యాక్షన్

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'.

Update: 2024-08-12 12:18 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. రహస్యాలెన్నో ఆ దీవిలో దాగిఉన్నాయి. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్‌గా బాబీ డియోల్ కనిపించాడు. అలాగే అతనే ఒక సైన్యం లాంటి కంగువ పాత్రలో సూర్య మేకోవర్, ఫెరోషియస్ పర్‌ఫార్మెన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. హీరోగా తన వారిని కాపాడుకునేందుకు కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు వరల్డ్ సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా మెస్మరైజింగ్ మేకింగ్‌తో 'కంగువ' ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags:    

Similar News