Kangana Ranaut: అవార్డులన్నీ మాఫియానే కొల్లగొడుతుందంటున్న కంగన
2022-23 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే
దిశ, సినిమా: 2022-23 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించింది. అంతేకాదు తను ఓ లిస్ట్ తయారు చేసి నెట్టింట పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. 'అవార్డ్స్ సీజన్ రావడంతో నెపో మాఫియా కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన ప్రతిభావంతుల నుంచి అన్ని అవార్డులను ఈ మాఫియానే కొల్లగొడుతోంది. 2022లో అత్యద్భుత ప్రదర్శనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కొన్ని సినిమాల జాబితా ఇదిగో' అంటూ పేర్లను వెల్లడించింది.
ఉత్తమ నటుడు - రిషబ్ శెట్టి (కాంతారా)
ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సహాయ నటుడు- అనుపమ్ ఖేర్ (కశ్మీర్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటి - టబు (దృశ్యం/భూల్ భూలయ్య)
అలాగే బాలీవుడ్ అవార్డుల గురించి ప్రస్తావించిన నటి 'షెడ్యూల్‌లో కాస్త సమయం దొరికినప్పుడు అర్హులని భావించే వాళ్లందరి లిస్ట్ తయారు చేస్తాను' అని ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నమైన చర్చలతో రచ్చ చేస్తున్నారు.