పైసలిస్తే Twitter బ్లూ మార్క్.. రీయాక్టివేషన్ చేయాలంటే ఎంత ఇవ్వాలి తెలుసా?
ట్విట్టర్ న్యూ ఓనర్, బిలియనీర్ ఎలన్ మస్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన బ్లూ టిక్ మార్క్(వెరిఫైడ్)ను పొందాలంటే..
దిశ, సినిమా : ట్విట్టర్ న్యూ ఓనర్, బిలియనీర్ ఎలన్ మస్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన బ్లూ టిక్ మార్క్(వెరిఫైడ్)ను పొందాలంటే.. నెలకు ఎనిమిది డాలర్స్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించాడు. కాగా దీనిపై మిక్స్‌డ్ రియాక్షన్ వస్తుండగా.. బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ డిఫరెంట్‌గా స్పందించాడు. 'డియర్ ఎలన్ మస్క్ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ చార్జెస్ కూడా ఇంట్రడ్యూజ్ చేయండి. మాలో చాలా మంది పే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇలా నెలవారీ కాకుండా ఐదేళ్ల బిల్లు ఒకేసారి కట్టేస్తా లింక్ పంపించు. ఫీజ్ చార్జ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. అప్పుడే వంద ఫాలోవర్స్ కలిగిన జర్నలిస్టులు ట్విట్టర్ నుంచి దూరంగా ఉంటారు. అవును సస్పెండెడ్ ఎకౌంట్‌ను రీయాక్టివేట్ చేసేందుకు ఎంత తీసుకుంటారు? మా చాలా మంది ఫ్రెండ్స్ 1000 డాలర్స్ చెల్లించేందుకు రెడీ గా ఉన్నారు' అని ట్వీట్ చేశాడు.