తెలుగులో మాట్లాడటం పై కాజల్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి సుపరిచితమే. సినీ రంగంలో అడుగుపెట్టిన కొంత కాలానికి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-05-21 08:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి సుపరిచితమే. సినీ రంగంలో అడుగుపెట్టిన కొంత కాలానికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోస్ సరసన నటించి అలరించింది. తన అందంతో, నటనతో, అభినయంతో అందరి మనసులు దోచుకుంది. ఈ అమ్మడుకు బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ ఫాలొయింగ్ ఎక్కువే. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్లు సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో ఫ్యామిలితో సంతోషంగా కెరీర్ రన్ చేస్తుంది. ప్రజెంట్ మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన సత్యభామ మూవీతో రాబోతుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సత్యభామ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాజల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తెలుగు వచ్చని, కానీ మాట్లాడేటప్పుడు కరెక్టా? కాదా? అనే డౌట్ వస్తుండటంతో అందరి ముందు ఎక్కువగా మాట్లాడలేనని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. సత్యభామ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ట్విటర్‌లో ఓ విడియోను షేర్ చేశారు. నాకు తెలుగు బాగా తెలుసు. అదంతా నా మనసులో ఉంటుంది. సత్యభామ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడి చూపిస్తా. హ్యాపీ గా ఉంటూ పక్కన వాళ్లందర్నీ హ్యాపీగా ఉండడమే నా బ్యూటీ సీక్రెట్ అని చెప్పారు.


Similar News