టాలీవుడ్ ఇండస్ట్రీపై కాజల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో మార్పు రాలేదంటూ నిజాలు బయటపెట్టేసిందిగా!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్స్ అందరితో నటించి టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-05-20 06:37 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్స్ అందరితో నటించి టాలీవుడ్ చందమామగా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేసి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీలోనే నటించి ఎన్నో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న క్రమంలో.. గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే కాజల్ ఓ బిడ్డకు తల్లి అయి.. మళ్లీ సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.  లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామతో కాజల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ పెళ్లి తర్వాత నా కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అయితే బాలీవుడ్‌లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఇక్కడ పెళ్లైన హీరోయిన్లను తీసుకోవడానికి మేకర్స్ చాలా ఆలోచిస్తారు. అయితే త్వరలో టాలీవుడ్‌లో మార్పు వస్తుంది అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది.

అలాగే తన భర్త గౌతమ్ కిచ్లు గురించి చెప్తూ.. నా భర్త నాకు ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలబడతాడు. నేను ఎంత బిజీగా ఉన్నా సరే నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. నా భర్త కూడా షూటింగ్ సెట్‌కి వచ్చి నన్ను కలుస్తుంటాడు. అవసరం అయితే ఫోన్ చేస్తాడు. నేను బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే.. మేనేజర్‌కు లేదా మేకప్ మెన్‌కి ఫోన్ చేస్తాడు. నేను నా భర్తకి అందుబాటులోనే ఉంటాను’’ అని చెప్పుకొచ్చింది.

Read More..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీ గౌతమ్.. భలే పేరు పెట్టిందిగా.. 

Tags:    

Similar News