భారతీయ అభిమానులకు షాకిచ్చిన జస్టిన్ బీబర్.. టూర్ క్యాన్సల్

పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారతీయ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వరల్డ్ టూర్‌ కచేరి ప్రకటించిన తర్వాత ఇప్పటికే చిలీ, అర్జెంటీనా,

Update: 2022-09-16 11:11 GMT
భారతీయ అభిమానులకు షాకిచ్చిన జస్టిన్ బీబర్.. టూర్ క్యాన్సల్
  • whatsapp icon

దిశ, సినిమా: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారతీయ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వరల్డ్ టూర్‌ కచేరి ప్రకటించిన తర్వాత ఇప్పటికే చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, యుఏఈ, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో తన ప్రదర్శనలు రద్దు చేసుకోగా తాజాగా ఇండియా టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు 2022 అక్టోబర్ 18న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరగాల్సిన 'జస్టిన్ బీబర్ జస్టిస్ వరల్డ్ టూర్-ఇండియా' సంగీత కచేరీని రద్దు చేసినట్లు BookMyShow నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. దురదృష్టవశాత్తు గాయకుడి అనారోగ్య సమస్యల కారణంగానే వచ్చే నెలలో భారత్ చేరుకోలేడని, తమకు రీసెంట్‌గా ఈ సమాచారం అందినట్లు వెల్లడించారు. అంతేకాదు ప్రదర్శన కోసం టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ తాము చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా వాపస్ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వార్తతో ఆయన ఫ్యాన్స్.. 'జస్టిన్ బీబర్‌కు భారతదేశానికి స్వాగతం పలకలేకపోవడం పట్ల మేము తీవ్ర నిరాశకు లోనవుతున్నాం. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.' అంటూ బాసటగా నిలుస్తున్నారు. కాగా జస్టిన్ కొంతకాలంగా ముఖ పక్షవాతంతో బాధపడున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News