Tamannaah పాటకు జూనియర్ సమంత హాట్ స్టెప్పులు.. చివరకు బోరున విలపించి..!
నిత్యం సోషల్ మీడియాలో రీల్స్, ఫొటో షూట్లతో అదరగొట్టే అషురెడ్డి.. జూనియర్ సమంతగా మంచి క్రేజ్ దక్కించుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో రీల్స్, ఫొటో షూట్లతో అదరగొట్టే అషురెడ్డి.. జూనియర్ సమంతగా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఆ క్రేజ్‌తోనే సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ కంట్లో పడింది. ఆయనతో ఇంటర్వ్యూ తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట ఓ వీడియో పంచుకుంది. బ్లాక్ మినీ టైట్ ఫిట్‌లో అషురెడ్డి ‘జైలర్’ చిత్రంలోని తమన్నా నటించిన ‘కావాలయ్యా’ సెన్సేషనల్ సాంగ్‌కు స్టెప్పులేసి.. అభిమానులను ఫిదా చేసింది.
మిల్క్ బ్యూటీలాగే సేమ్ స్టెప్పులతో ఆకట్టుకుంది. మరోవైపు థైస్ అందాలతో మతులు పోగొట్టింది. కానీ చివరల్లో ఊహించని షాక్ ఇచ్చింది. బాగానే డాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ వెనకాల ఉన్న చెక్కమొద్దుకు కాలును బలంగా తాకింది. డాన్స్ ఆపి పాపం కాలుని పట్టుకొని విలపించింది. అషురెడ్డికి దెబ్బ తగలడంతో ఫ్యాన్స్ చూసుకోవాలి కదారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.