Johnny Master: ‘నన్ను బలవంతపెట్టిన ప్రతీసారి ఆ డైరెక్టర్‌తో చెప్పా’.. విచారణలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు??

తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్(Jani Master) వివాదం ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-09-27 13:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్(Jani Master) వివాదం ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీ(Police custody)లో ఉన్నారు. మూడ్రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి స్టే‌ట్మెంట్ ఆధారంగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా.. శుక్రవారం నాడు జరిపిన విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించారట. సదరు యువతి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారట. మైనర్‌గా ఉన్న సమయంలో తాను వేధింపులకు గురి చేశాననడం పచ్చి అబద్ధం అని అన్నారట. చాలాసార్లు యువతి తీరుతోనే తాను బాధ పడ్డానని, పెళ్లి చేసుకోవాలని తనపై చాలా సార్లు ఒత్తిడి చేసిందని జానీ మాస్టర్ వెల్లడించారట.

తాను నిరాకరించే సరికి కుట్ర చేసి తనపై కావాలనే లైంగిక ఆరోపణలు చేసిందని ఆవేదన చెందారట. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని, తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానని, పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతీసారి డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్లానని జానీ మాస్టర్ వెల్లడించినట్లు సమాచారం. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో మార్పు రాలేదని, నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేసినట్లు టాక్ వినిపిస్తుంది.


Similar News