'ఏంజెల్' అని పిలవడంపై భిన్నంగా స్పందించిన Janhvi Kapoor.. వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తనను ఫొటోగ్రాఫర్లు 'ఏంజెల్' అని పిలవడంపై భిన్నంగా స్పందించింది.

Update: 2022-12-14 08:11 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తనను ఫొటోగ్రాఫర్లు 'ఏంజెల్' అని పిలవడంపై భిన్నంగా స్పందించింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఎప్పటిలాగే హాల్టర్ నెక్ డిటెయిలింగ్‌ని కలిగి ఉన్న పసుపురంగు గౌనులో దర్శనమిచ్చింది. టోన్డ్ బాడీతోపాటు తనకు ఇచ్చిన అవార్డును చూపిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. ఆ సమయంలో కెమెరామెన్లు ఆమెను ఏంజెల్ అంటూ పొగిడేశారు.

దీంతో తనకు వాళ్లేమంటున్నారో సరిగ్గా అర్థం కాకపోవడంతో 'మీరు నన్ను ఏమని పిలుస్తున్నారు?' అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా 'మీరు ఈ ఫిట్‌లో చాలా అందంగా ఉన్నారు. అందుకే ఏంజెల్ అని పిలుస్తున్నాం' అని చెప్పడంతో 'వీ అగ్రీ విత్ ది పాప్స్' అనేలా సిగ్నల్ ఇస్తూ మరింత సంతోషంగా వేదికపైనుంచి వెళ్లిపోవడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా 'నిజమే.. ఆమె ఒక దేవదూత' అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.

Also Read....

మోడీ, ముఖేష్ అంబానీలతో వేదిక పంచుకోనున్న Ram Charan .. 

Tags:    

Similar News