జబర్దస్త్ యాంకర్ అంటే చెప్పులు మీదేసినా వేయించుకోవాలా..? రష్మి పరిస్థితి దారుణంగా తయారైందిగా...
సాధారణంగా యాంకర్ అంటే ఎక్కడైనా మినిమమ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది.
దిశ, సినిమా: సాధారణంగా యాంకర్ అంటే ఎక్కడైనా మినిమమ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. స్కిట్ చేసే కమెడియన్స్ ఎన్ని కామెంట్లు చేసినా సర్దుకుపోవాలి. ఎంత హర్టింగ్ గా మాట్లాడినా దులుపేసుకోవాలి. అందుకే రష్మి తప్ప మిగిలిన వాళ్లు అందరూ తప్పుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. తనకి రెమ్యూనరేషన్ అధికంగా ఉండటం..సెట్ లో అందరూ ఫ్రెండ్స్ అయిపోవడంతో ఇంకా కంటిన్యూ చేస్తుందని సమాచారం. అయితే ఇన్నాళ్లు ఈ కామెడీ పంచులు ఒక లిమిట్ లో ఉన్నా లేటెస్ట్ ప్రోమోలో మాత్రం శ్రుతి మించినట్లు అనిపిస్తుంది.
ప్రోమోలో ఇమ్మాన్యుయల్ టీమ్ 'టిల్లు స్క్వేర్ ' స్కూప్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో ఇద్దరు సిద్దు క్యారెక్టర్ ప్లే చేయగా.. ఒక కమెడియన్ కొత్తగా కనిపించాడు. ఈయన రష్మి దగ్గరకు వెళ్లి అనుపమను సిద్దు ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా 'నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ' అని అడుగుతాడు. దీనికి నీకెందుకని ఆమె సమాధానం ఇస్తుంది. ' ఉంటే నా షూ నేను వేసుకుని వెళ్తా లేడంటే నీ మీద షూ వేసి వెళ్తా ' అని సమాధానం ఇస్తాడు. అయితే రష్మికి అసలు విషయం అర్థం కానట్లే కనిపిస్తుండగా.. ' జబర్దస్త్ యాంకర్ అయితే చెప్పులు కూడా మీదేస్తారా? మరీ దారుణంగా ఉన్నారుగా ' అనే కామెంట్స్ వస్తున్నాయి.
Read More...