జబర్దస్త్ నటుడికి చేతబడి.. సంచలనం రేపుతోన్న కామెంట్స్

జబర్దస్త్ షో వీక్షించే ప్రేక్షకులకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-11-16 07:00 GMT
జబర్దస్త్ నటుడికి చేతబడి.. సంచలనం రేపుతోన్న కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో వీక్షించే ప్రేక్షకులకు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడీ గెటప్‌ వేసుకుని తనదైన శైలిలో కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. బుల్లితెర షో ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ నటుడు ఇటీవల ఇంటి ఓనర్‌తో గొడవ పడి కేసుల వరకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. తర్వాత ఈ గొడవలన్నీ సద్దుమనిగాక వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఓ పక్క యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ.. మరోపక్క జబర్దస్త్‌లో నవ్వులు పూయిస్తూ.. అంతా బాగానే ఉందనుకునే సమయంలో అనారోగ్యానికి గురయ్యానంటూ వినోద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  అనారోగ్యం పాలైన విషయం గురించి చెబుతూ.. వినోద్‌పై చేతబడి చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. హాస్పిటల్స్‌కు, చేతబడి విరుగుడు పూజలకు మొత్తం కలిపి రూ. 3 లక్షల వరకు ఖర్చు అయిందని వెల్లడించాడు.

ఆ సమయంలో సహానటులు చాలా మంది తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని తెలిపాడు. వినోద్ అడక్కపోయినా వారంతట వారే వచ్చి హెల్ప్ చేయడం వల్ల తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. అలాగే ఇంటి ఓనర్‌తో గొడవలు జరిగినప్పుడు చేయి విరిగిందని, అప్పుడు 5 లక్షల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం వినోద్ ఆరోగ్యం బాగానే ఉందని, జబర్దస్త్ ఈవెంట్స్ కూడా చేసుకుంటానని వెల్లడించాడు. ప్రస్తుతం వినోద్ చేతబడి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News