ఆసుపత్రిలో జబర్దస్త్ నటుడు.. సర్జరీ కోసం ఇంటిని అమ్మేశానంటూ ఎమోషనల్ కామెంట్స్
జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ ఈ షో ద్వారా మంచి ఆదరణ పొందాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
దిశ, సినిమా: జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ ఈ షో ద్వారా మంచి ఆదరణ పొందాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, తన తల్లి సర్జరీ చేయించేందుకు ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఓ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం స్ట్రగుల్స్, షూట్స్ హడావిడి మా అమ్మగారి ఆరోగ్యం వంటి సమస్యల వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను.
మా అమ్మ సర్జరీ కోసమే ఇల్లు అమ్మేశానని మీకుడా తెలుసు. అయితే ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో మా అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి అయింది. మా అమ్మ బాగుండాలని కోరుకోండి. ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ అంతా మమ్మల్ని బాగా చూసుకున్నారు. అపోలో యాజమాన్యం అందరికీ ధన్యవాదాలు. మమ్ములను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. కుమార్ అన్న మా అమ్మకు మాకు చాలా సహాయం చేశారు చాలా థాంక్స్. మీరంతా నన్ను సపోర్ట్ చేయండి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాంతిస్వరూప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.