ఆసుపత్రిలో బెడ్‌పై జబర్దస్త్ కమెడీయన్ రోహిణి.. చేతులెత్తేసిన డాక్టర్స్

కమెడీయన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2023-05-15 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కమెడీయన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై తన జోక్స్‌తో ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో తెలిసిన విషయమే. ఆమె ఇండస్ట్రీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. అయితే 2016లో రోహిణి యాక్సిడెంట్‌కు గురయ్యారు. అప్పుడు ఆమె కాలు ఫ్రాక్చర్ కావడంలో డాక్టర్స్ సర్జరీ చేసి రాడ్ వేశారు. గాయం తగ్గినప్పటికీ లోపల రాడ్ ఉండడం వల్ల డాన్స్ చేయడానికీ ఇబ్బందిగా ఉంటుందని, దాన్ని తీపించడం కోసం ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు తనకు అన్ని పరీక్షలు చేసి, మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. రాడ్ బయటకు తీయాలని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. కాగా.. ఎముక లోపల రాడ్డు బాగా కూరుకుపోయిందని, బలవంతంగా తీస్తే ఎముక దెబ్బతిని మళ్ళీ కాలు విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చేతులెత్తేశారు. డ్యాన్స్ చేసేటప్పుడు నొప్పి రాకుండా మాత్రం కొన్ని రకాల మందులు ఇస్తామని సలహా ఇచ్చారు.  

Also Read: బట్టల్లేకుండా ఫోజులిచ్చిన సీనియర్ నటి Kasthuri Shankar 

Tags:    

Similar News